ముంబై: మహారాష్ట్రలో విపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలపై ఈడీ (ED) దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శివసేన ఉద్దవ్ వర్గం (Shiv Sena UBT) ఎమ్మెల్యే రవీంద్ర వైకర్ (MLA Ravindra Waikar) నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముంబైలోని జోగేశ్వరీ ప్రాంతంలో ఓ లగ్జరీ హోటల్ నిర్మాణంలో మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రవీంద్ర ఇంటితోపాటు మరో ఏడు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
జోగేశ్వరీ ఈస్ట్ ఎమ్మెల్యే ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి అక్రమంగా అనుమతులు పొందారని, ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ముంబై పోలీస్ ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. దీనివల్ల బృహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు (BMC) పెద్దమొత్తంగా నష్టం వాటిల్లినట్లు ఆరోపించింది.