ED raids | రన్యారావు కేసు.. కర్ణాటక హోంమంత్రికి ఈడీ షాక్
ED raids | బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి (Karnataka Home Minister) జి.పరమేశ్వర (G Parameshwara)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు షాకిచ్చారు
ED raids | బంగారం స్మగ్లింగ్ కేసు (gold smuggling case)లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు (Ranya Rao) కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తాజాగా ఈ కేసులో ఆ రాష్ట్ర హోం మంత్రి (Karnataka Home Minister) జి.పరమేశ్వర (G Parameshwara)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు షాకిచ్చారు. మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న తుమకూరులోని శ్రీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో సోదాలు చేపట్టారు.
రన్యారావు కేసులో మనీలాండరింగ్‌పై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. రాన్యా రావుకు, మెడికల్ కాలేజీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. దీంతో, అధికారులు బుధవారం ఉదయం కళాశాలలో తనిఖీలు చేపట్టారు. కాలేజీకి సంబంధించిన పలు రికార్డులు, ఆర్థిక లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈడీ సోదాలు చేపట్టిన సమయంలో మంత్రి పరమేశ్వర కాలేజీలో లేరని తెలిసింది. తన అనుచరులతో వేరే ప్రాంతంలో సమావేశమైనట్లు సంబంధిత వర్గాల సమాచారం.
రన్యారావుకు బెయిల్
కన్నడ నటి అయిన రన్యారావును మార్చి 3న బంగారం స్మగ్లింగ్ కేసులో డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకొని.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో తరుణ్ రాజ్, సాహిల్ సకారియా జైన్లను కూడా అ ధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ముగ్గురు బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఉన్నారు.
ఈ క్రమంలో నిన్న రన్యారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెతో పాటు తరుణ్ రాజ్ కొండూరు (Tarun Raj Konduru)కు కూడా బెంగళూరు కోర్టు (Bengaluru Court) మంగళవారం డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది.
వారిద్దరు చట్టబద్ధమైన బెయిల్‌కు అర్హులేనని, ఇద్దరు వ్యక్తుల నుంచి వ్యక్తిగత పూచికత్తు, ఒక్కొక్కరు రూ.2 లక్షల వ్యక్తిగత బాండ్‌ను సమర్పించిన తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేయాలని ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అధికారులు పిలిచిన సమయంలో తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించొద్దని.. దర్యాప్తు అధికారులకు సహకరించాలని, కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని.. భవిష్యత్‌లో ఇదే తరహాలో నేరాల్లో పాల్గొనొద్దని ఆదేశించింది.
Also Read..
“Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాన్యారావు జుడిషియల్ కస్టడీ పొడిగింపు”
“38 కోట్ల హవాలా రాకెట్లో రన్యా రావు!”
“Ranya Rao | నటి రన్యా రావు వెనుక కాంగ్రెస్ మంత్రి!”
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

