బెంగళూరు: మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేశ్‌కు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం మంగళవారం బెంగళూరులోని తమ కార్యాలయానికి రావాలని పార్వతిని ఈడీ పిలిచింది. అయితే, ఈడీ నోటీసులపై పార్వతి, మంత్రి హైకోర్టును ఆశ్రయించారు.
నోటీసులపై సోమవారం హైకోర్టు స్టే ఇవ్వడంతో వీరికి తాత్కాలిక ఊరట లభించింది. మరోవైపు ముడా భూ కుంభకోణాన్ని విచారించిన కర్ణాటక లోకాయుక్త పోలీసులు సోమవారం హైకోర్టు ధర్వాడ్ బెంచ్‌కి విచారణ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించారు. కాగా, ముడా కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో సోమవారం వాదనలు కొనసాగాయి. జస్టిస్ ఎం నాగప్రసన్న తీర్పును రిజర్వ్ చేశారు.