ECI | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై రేపు కేంద్ర ఎన్నికల సంఘం రివ్యూ
Assembly Elections 2022 | కరోనా కేసుల పెరుగుదల మధ్య ఎన్నికల్లో ర్యాలీలు, రోడ్‌షోలు, బైక్‌ర్యాలీలు, పాదయాతలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్,

న్యూఢిల్లీ : కరోనా కేసుల పెరుగుదల మధ్య ఎన్నికల్లో ర్యాలీలు, రోడ్‌షోలు, బైక్‌ర్యాలీలు, పాదయాతలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. కరోనా వైరస్ కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల ఆరోగ్యశాఖ కార్యదర్శులతో సమీక్షించిన తరువాత ఈ నెల 22న నిషేధాన్ని 31వ తేదీ వరకు పొడిగించింది.
అయితే, ఫిబ్రవరి 10న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి, 14న ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఫిబ్రవరి 1 నుంచి రాజకీయ పార్టీలకు, పోటీ చేసే అభ్యర్థులకు మినహాయింపు ఇచ్చింది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సమీక్ష నిర్వహించనున్నది. వర్చుల్ విధానం ఉదయం 11 గంటలకు సమావేశం జరుగనున్నది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం పరిస్థితి, కేసులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోనున్నది. వర్చువల్ మీటింగ్‌లో పోలింగ్ జరగనున్న రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులు, ఆరోగ్య కార్యదర్శులు హాజరయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

