Election Comission | 24న ఛత్తీస్‌గఢ్‌లో ఈసీ పర్యటన.. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..!
Election Comission | తెలంగాణతోపాటు త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనున్నది. గురు, శుక్రవారాల్లో ఛత్తీస్ గఢ్ లో పర్యటిస్తుందని ఈసీ వర్గాలు తెలిపాయి.
Election Comission | తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారధ్యంలో ఎన్నికల కమిషనర్లు, అధికారులు పర్యటిస్తారు. ఈ నెలాఖరులో మిజోరంలో పర్యటిస్తారని ఈసీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందుగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పర్యటించి.. ఏర్పాట్లను సమీక్షిస్తారు.
వచ్చే అక్టోబర్-నవంబర్‌లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఏడాది డిసెంబర్ 17తో మిజోరం అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది జనవరిలోని వివిధ తేదీలతో గడువు ముగుస్తుంది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పీటీ స్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలవాలి.. గోదావరిఖనిలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: హరీశ్‌రావు
Sensational Decision | వైఎస్ జగన్ సంచలన నిర్ణయం.. ఓటు వేయకుండానే వెనుతిరిగిన మాజీ సీఎం
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ ‘ఆర్సీ 17’ ప్రీ లుక్ పోస్టర్ విడుదల.. ఈ చిత్రంతో ఆసక్తికరమైన సంకేతాలు!
IND vs NZ | శ్రేయస్, ఇషాన్ హాఫ్ సెంచరీలు .. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..!
Cop Arrested For Raping Woman | పోలీస్ స్టేషన్లో మహిళపై అత్యాచారం.. కానిస్టేబుల్ అరెస్ట్, మరో ఐదుగురు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

