న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల అమలుకు భారత ఎన్నికల సంఘానికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టకూడదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జేఎస్ ఖేహార్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సూచించారు. రాజ్యాంగ (100, 29 సవరణ) బిల్లు 2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు (సవరణ) బిల్లు 2024 పరిశీలనకు ఏర్పాటు చేసిన జేపీసీ సమావేశంలో జమిలి ఎన్నికలపై ఇద్దరు మాజీ సీజేఐలు వారి పరిశీలనలకు సంబంధించిన ప్రజెంటేషన్లను సమర్పించారు. జమిలి ఎన్నికల నిర్వహణకు బిల్లులో చేపట్టాల్సి సవరణలపై జేపీసీ న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నది.