లక్నో: ట్రాఫిక్ పోలీస్‌ను మహిళా డ్రైవర్ చెప్పుతో కొట్టింది. ఎలక్ట్రిక్ ఆటో నడిపే ఆమెను ప్రతిఘటించేందుకు ఆ ట్రాఫిక్ పోలీస్ కొంతసేపు ప్రయత్నించాడు. (Woman Driver Hits Traffic Cop With Slippers ) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఎలక్ట్రిక్ ఆటో నడిపే మహిళను ట్రాఫిక్ పోలీస్ అడ్డుకున్నాడు. నంబర్ ప్లేట్ లేకపోవడాన్ని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన మహిళా డ్రైవర్, ట్రాఫిక్ పోలీస్‌ను చెప్పుతో కొట్టింది. తొలుత ప్రతిఘటించిన ఆ పోలీస్ ఆ తర్వాత వెనక్కి తగ్గాడు. ఆ ప్రాంతంలోని జనం చూస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కాగా, స్థానికులు కొందరు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వాహనానికి నంబర్ ప్లేట్ లేకపోవడంపై కేసు నమోదు చేశారు. ఎలక్ట్రిక్ ఆటో నడిపే ఆ మహిళా డ్రైవర్ పలువురి పట్ల చాలాసార్లు దురుసుగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు.
उत्तर प्रदेश गाजियाबाद के NH9 कनवानी पुस्ता रोड पर ट्रैफिक पुलिस कर्मी दरोगा से ई रिक्शा चालक महिला भिड़ी आपस में जोरदार मारपीट की गई जिसमें हाथ चप्पल जूते सब चले pic.twitter.com/17CouYyVTN
— Mαɳιʂԋ Kυɱαɾ αԃʋσƈαƚҽ 🇮🇳🇮🇳 (@Manishkumarttp) October 11, 2023