లక్నో: వర్షం కురుస్తుండగా ఒక తాగుబోతు రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చొన్నాడు. (Drunk man sits on chair on Road) ఒక లారీ అతడ్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 29న మద్యం సేవించిన ఒక వ్యక్తి వర్షం కురుస్తుండగా రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చొన్నాడు. ఇంతలో ఒక లారీ పాక్షికంగా అతడ్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. లారీ ఢీకొట్టడంతో కుర్చీ విరిగింది. దీంతో అతడు రోడ్డుపై పడ్డాడు.
కాగా, ఆ వ్యక్తిని అజయ్‌గా పోలీసులు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అజయ్ మానసిక వికలాంగుడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అతడ్ని కుటుంబానికి పోలీసులు అప్పగించారు. మరోవైపు స్థానిక పోలీస్ బూత్ ఎదురుగా జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A drunk man in Uttar Pradesh’s Pratapgarh had a narrow escape after a truck knocked him down while he was sitting on a chair in the middle of a busy road during heavy rain.
The incident which took place in front of a police booth is said to have occurred on August 29.
Read… pic.twitter.com/6OSUCapnSc
— IndiaToday (@IndiaToday) September 1, 2024