ముంబై: ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి డంపర్ లారీ దూసుకెళ్లింది. ఇద్దరు పసి పిల్లలతో సహా ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో డంపర్ లారీని నడిపిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Pune accident) వాఘోలీలోని కేస్నంద్ ఫాటా సమీపంలో ఫుట్‌పాత్‌పై 12 మంది నిద్రించారు. సోమవారం తెల్లవారుజామున మద్యం మత్తులో డంపర్ లారీని నడిపిన డ్రైవర్ వారి మీదుగా దూసుకెళ్లాడు. వీరిలో 9 మంది ఆ డంపర్ కింద నలిగిపోయారు. ఇద్దరు పసి పిల్లలతో సహా ముగ్గురు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను 22 ఏళ్ల విశాల్ వినోద్ పవార్, ఏడాది వయస్సున్న వైభవి రితేష్ పవార్, రెండేళ్ల వయస్సున్న వైభవ్ రితేష్ పవార్‌గా గుర్తించారు. గాయపడిన ఆరుగురిని సాసూన్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీస్ అధికారి తెలిపారు. మద్యం మత్తులో డంపర్ లారీని నడిపిన 26 ఏళ్ల డ్రైవర్ గజానన్ శంకర్ టోత్రేను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.