లక్నో: దగ్గుతో బాధపడుతున్న చిన్నారికి ఒక డాక్టర్ వినూత్నంగా చికిత్స అందించాడు. చిరు బాలుడితో సిగరెట్ తాగించాడు. నోటిలోకి పొగ పీల్చితే దగ్గు తగ్గుతుందని చెప్పాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Drunk Doctor Treats Child With Cigarette) ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుథౌండ్లోని ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సురేష్ చంద్ర పని చేస్తున్నాడు. దగ్గుతో బాధపడుతున్న నాలుగేళ్ల బాలుడు తన పేరెంట్స్‌తో కలిసి ఆ ఆసుపత్రికి వెళ్లాడు.
కాగా, బెంచ్‌పై ఒంటరిగా కూర్చొన్న బాలుడ్ని డాక్టర్ సురేష్ చంద్ర చూశాడు. ఆ చిన్నారి దగ్గుతో బాధపడుతున్నట్లు తెలుసుకున్నాడు. సిగరెట్ ప్యాక్ నుంచి ఒక సిగరెట్ బయటకు తీశాడు. ఆ చిన్నారి నోట్లో పెట్టి లైటర్‌తో వెలిగించాడు. సిగరెట్ పొగను నోట్లోకి బాగా పీల్చాలని చెప్పాడు. అలా చేస్తే దగ్గుపోతుందని అన్నాడు. దీంతో డాక్టర్ చెప్పినట్లుగా ఆ బాలుడు సిగరెట్ స్మోక్ చేసి పొగను పీల్చాడు.
మరోవైపు ఆ హాస్పిటల్ వద్ద ఉన్న ఒక వ్యక్తి దీనిని గమనించాడు. డాక్టర్ సురేష్ చంద్ర ఆ చిన్నారితో సిగరెట్ స్మోక్ చేయించడాన్ని మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ డాక్టర్ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ డాక్టర్‌పై చర్యలు చేపట్టారు. సురేష్ చంద్రను మరో ఆసుపత్రికి బదిలీ చేశారు. పోలీసులు కూడా ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
#Jalaun : शराबी डॉक्टर की आपत्तिजनक करतूत
सिरफिरा डॉक्टर बच्चे को सिगरेट पिला कर रहा है जुकाम का ईलाज
डॉ की करतूत कैमरे में हुई कैद वीडियो सोशल मीडिया पर वायरल
सामुदायिक स्वास्थ्य केन्द्र कुठौंद में तैनात है डॉक्टर सुरेश चंद्र@brajeshpathakup | @CMOfficeUP | @UPGovt |… pic.twitter.com/9AKL4PfvlP
— News1India (@News1IndiaTweet) April 16, 2025