గాంధీనగర్, అక్టోబర్ 21 : గుజరాత్‌లోని భరూచ్ జిల్లా అంక్లేశ్వర్ జీఐడీసీ ప్రాంతంలోని అవ్సర్ ఎంటర్ప్రైజెస్ నుంచి రూ.250 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. సూరత్, భరూచ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రూ.14.10 లక్షల విలువైన 141 గ్రాముల ఎండీ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 427 కిలోల అనుమానిత మాదక ద్రవ్యాలను పరీక్ష కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. అవ్సర్ ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ విశాల్ పటేల్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల అంక్లేశ్వర్ ప్రాంతంలోనే రూ.5 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేశారు.