న్యూఢిల్లీ: మీ ఇంట్లో ఈ 17 రకాల మందుల్లో ఏ ఒక్కటి ఉన్నా వెంటనే వాటిని జాగ్రత్తగా టాయిలెట్లో వేసి ఫ్లష్ చేయండి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) హెచ్చరించింది. వాటిలో ఫెంటానిల్, ట్రమడోల్, డయాజెపమ్ వంటి శక్తిమంతమైన మందులు కూడా ఉన్నాయి. ఇవి కాలం చెల్లినా, లేదంటే ఉపయోగించకపోయినా వెంటనే వాటిని టాయిలెట్లో ఫ్లష్ చేయాలని సీడీఎస్సీవో పేర్కొంది. వీటిని పొరపాటున సింగిల్ డోస్ తీసుకున్నా, పిల్లలు కానీ, పెంపుడు జంతువులు కానీ ప్రమాదవశాత్తు మింగినా తీవ్ర పరిణామాలకు కారణమవుతుందని తెలిపింది.
ఫెంటానిల్, ఫెంటానిల్ సిట్రేట్, మార్ఫిన్ సల్ఫేట్, బప్రేనార్ఫిన్, బప్రేనార్ఫిన్ హైడ్రోక్లోరైడ్, మెథిల్ఫెనిడేట్, మెపిరిడిన్ హైడ్రోక్లోరైడ్, డయాజెపమ్, హైడ్రోమార్ఫిన్ హైడ్రోక్లోరైడ్, మెథాడొన్ హైడ్రోక్లోరైడ్, హైడ్రోకోడోన్ బిటార్ట్రేట్, టపెంటాడాల్, ఆక్సిమార్ఫోన్ హైడ్రోక్లోరైడ్, ఆక్సికోడోన్, ఆక్సికోడోన్ హైడ్రాక్లోరైడ్, సోడియం ఆక్సిబేట్, ట్రమడాల్.