న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అయిన సందర్భంగా ఈసారి రిపబ్లిక్ డేను చాలా గ్రాండ్‌గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా రిపబ్లిక్ డే వేడుకల ముగింపు సందర్భంగా జనవరి 29న విజయ్ చౌక్‌లో జరిగే బీటింగ్ రిట్రీట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. తొలిసారి డ్రోన్లు, లేజర్ షో నిర్వహిస్తున్నది. ఈ మేరకు సోమవారం రిహార్సిల్స్ జరిగాయి. డ్రోన్లు, లేజర్ షో ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి.
కాగా, బీటింగ్ రిట్రీట్ సందర్భంగా తొలిసారి నిర్వహిస్తున్న డ్రోన్ షోలో వెయ్యికిపైగా దేశీయంగా తయారు చేసిన డ్రోన్లను వినియోగిస్తున్నారు. డ్రోన్ల విద్యుత్ కాంతులతో ఆకాశంలో పలు ఆకృతులు రూపొందించనున్నారు.
అయితే, ఇలాంటి డ్రోన్ షో జరుగడం దేశంలోనే ఇదే తొలిసారి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ పేరుతో ఏడాదిపాటు పలు కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది.
#WATCH | Delhi: Drones form the outline of the National War Memorial as they rehearse for the #BeatingRetreat ceremony.
— ANI (@ANI) January 24, 2022
1000 Made in India drones rehearse for the ceremony to be held at the Vijay Chowk on January 29th. They would be performing at the event for the first time. pic.twitter.com/aKIIIo6HzI
#WATCH | Delhi: 1000 Made in India drones rehearse for Beating the Retreat ceremony to be held at the Vijay Chowk on January 29th. They would be performing at the event for the first time. pic.twitter.com/Jbp8MepEUt
— ANI (@ANI) January 24, 2022