Driving Test | న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన నూతన నిబంధనావళి జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో వచ్చిన వార్తా కథనాలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ (ఏడీటీసీ) నుంచి సర్టిఫికెట్స్ పొందాక డ్రైవింగ్ టెస్ట్ అవసరం లేదన్న వార్తలు చక్కర్లు కొట్టాయి.
దీంతో ఈ అంశంపై మరింత స్పష్టతనిస్తూ కేంద్ర శనివారం కీలక ప్రకటన చేసింది. ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ నుంచి సర్టిఫికెట్స్ అందుకున్నప్పటికీ, ఆర్టీవో కేంద్రాల వద్ద డ్రైవింగ్ టెస్ట్‌ను ఎదుర్కొనటం తప్పనిసరి అని తేల్చిచెప్పింది. పాత నిబంధనల్లో మార్పులు జారీచేయలేదని తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరి..అని వివరించింది.