microchip shortage| న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా మైక్రోచిప్‌లకు తీవ్ర కొరత ఏర్పడింది. ఆటోమొబైల్స్, కంప్యూటర్స్, స్మార్ట్‌ఫోన్స్, గ్రాఫిక్స్ కార్డ్స్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీలపై దీని ప్రభావం అధికంగా పడింది. దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలపైనా ప్రభావం పడింది. మైక్రోచిప్‌ల కొరత కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో స్మార్ట్‌కార్డ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల (ఆర్సీ) జారీ ఆలస్యమవుతున్నదని కథనాలు వెలువడుతున్నాయి. కరోనా సమయంలో మైక్రోచిప్‌ల తయారీ, సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వీటికి తీవ్ర కొరత ఏర్పడింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో దేశంలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ జారీ ప్రక్రియ ఆలస్యమవుతున్నదని నిపుణులు చెబుతున్నారు.