న్యూఢిల్లీ : శత్రు యుద్ధ నౌకలపై నిఘా పెట్టే వాటర్ డ్రోన్‌ను డీఆర్డీవో ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. భూ ఉపరితలం, నీటిపై నిర్వహించిన ఈ పరీక్షలో వెహికల్ సోనార్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు చక్కగా పనిచేసినట్టు డీఆర్డీవో తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో మన దేశ అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరిందని పేర్కొంది. భూమిపై, సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్ ద్వారా శత్రు దేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టవచ్చునని తెలిపింది. ఈ వాటర్ డ్రోన్ 6 టన్నుల బరువుంటుందని, గరిష్ఠంగా గంటకు 14 కి.మీ వేగంతో 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదని డీఆర్డీవో తెలిపింది.