Pralay Missile | ప్రళయ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
Pralay Missile | రత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఒడిశా తీరం (Odisha coast) లో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్ (Pralay)’ ని విజయవంతంగా పరీక్షించింది.
Pralay Missile : భారత రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఒడిశా తీరం (Odisha coast) లో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్ (Pralay)’ ని విజయవంతంగా పరీక్షించింది. ఒకే లాంచర్ నుంచి రెండు క్షిపణులను స్వల్ప వ్యవధిలో ప్రయోగించి వాటి సామర్థ్యాన్ని విజయవంతంగా పరిశీలించింది. యూజర్ ఎవాల్యుయేషన్ ట్రయల్స్‌లో భాగంగా ఈ పరీక్షలు నిర్వహించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.
ఇవాళ (బుధవారం) ఉదయం 10:30 గంటల సమయంలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ప్రయోగించిన రెండు క్షిపణులు నిర్దేశిత మార్గంలో ప్రయాణించి, లక్ష్యాలను కచ్చితత్వంతో చేధించాయని అధికారులు తెలిపారు. చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో మోహరించిన ట్రాకింగ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును ధృవీకరించుకున్నారు. డీఆర్డీవో సీనియర్ శాస్త్రవేత్తలు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.
‘ప్రళయ్’ క్షిపణి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సాలిడ్ ప్రొపెల్లెంట్ క్వాసీ-బాలిస్టిక్ మిసైల్. అత్యాధునిక నావిగేషన్, గైడెన్స్ వ్యవస్థలతో పనిచేసే ఈ క్షిపణి.. వివిధ రకాల వార్హెడ్లను మోసుకెళ్తూ శత్రువుల స్థావరాలపై విరుచుకుపడగలదు. హైదరాబాద్‌లోని రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) తోపాటు పలు డీఆర్డీవో ల్యాబ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) లాంటి సంస్థల సహకారంతో దీన్ని అభివృద్ధి చేశారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంపట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తంచేశారు. సాల్వి లాంచ్ విజయవంతం కావడంతో క్షిపణి విశ్వసనీయత నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయంపై డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ మాట్లాడుతూ.. త్వరలోనే ఈ క్షిపణి వ్యవస్థను సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తుదిదశలో ఉన్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

