న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ(DRDO) కీలక పరీక్షలు చేపట్టింది. అత్యాధునిక డిఫెన్స్ సిస్టమ్‌ను పరీక్షించింది. బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థలతో పాటు యాంటీ షిప్ మిస్సైళ్లను ఎదుర్కొనే టెక్నాలజీని పరీక్షించినట్లు ఇవాళ డీఆర్డీవో వెల్లడించింది. ఈ ట్రయల్ పరీక్షలు జూన్ 10,11వ తేదీల్లో నిర్వహించారు. ప్రస్తుతం ఆధుని టెక్నాలజీతో వస్తున్న క్షిపణులు, మారీటైం ముప్పును ఎదుర్కొనే రీతిలో ఉండే కొత్త తరహా టెక్నాలజీ ఆధారిత ఆయుధాలను పరీక్షించినట్లు డీఆర్డీవో పేర్కొన్నది. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న దీక్షతో భారత్ తన ఆయుధ పరీక్షలను చేపట్టింది.
మూడు రకాల ఫ్లయిట్ టెస్ట్‌లను నిర్వహించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ విన్యాసాల్లో భాగంగా ఇంటర్సెప్టార్ క్షిపణులను లాంచ్ చేశారు. నిర్దేశిత టార్గెట్లపై వాటిని పరీక్షించారు. అనుకున్న లక్ష్యాలను అందుకున్నట్లు తెలిసింది. బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌కు చెందిన పలు దశలను ఈ పరీక్షల్లో టెస్ట్ చేశారు. దూసుకు వస్తున్న క్షిపణులను నిర్వీర్యం చేసేందుకు కావాల్సిన టెక్నాలజీని పరీక్షించారు. మిస్సైల్‌ను డిటెక్ట్ చేసి, ట్రాక్ చేసి దాన్ని ధ్వంసం చేసే టెక్నాలజీని పరీక్షించారు. భారత వ్యూహాత్మక భద్రత అంశంలో ఇది కీలకమైన అడుగు అని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు.
బాలిస్టిక్ క్షిపణుల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనే దేశాల్లో ఇప్పుడు ఇండియా కూడా చేరినట్లు రక్షణ శాఖ పేర్కొన్నది. కొన్ని దేశాల వద్ద మాత్రమే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉన్నది. బాలిస్టిక్ నుంచి ఖండాతర క్షిపణులను కూడా ఎదుర్కొనే రీతిలో కొత్త టెక్నాలజీని పరీక్షించారు. బీఎండీ సామర్థ్యం ఉన్న ఎలైట్ దేశాల్లో ఇండియా చేరినట్లు రక్షణ శాఖ తెలిపింది. నావల్ యాంటీ షిప్ మిస్సైల్ మీడియం రేంజ్ పరీక్ష కూడా డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. యాంటీ షిప్ మిస్సైల్ ముప్పును కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అయితే మారీటైం దళాలకు ఇది చాలా శక్తిని ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. సముద్రం మార్గంలో ఉన్న శత్రువులను చిత్తు చేసేందుకు యాంటీషిప్ మిస్సైల్ టెక్నాలజీ మన నౌకాదళాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
విదేశీ రక్షణ వ్యవస్థల కన్నా.. స్వదేశీ రక్షణ వ్యవస్థలపై ఆధారపడే రీతిలో డీఆర్డీవో పరీక్షలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ డీఆర్డీవోకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు రకాల పరీక్షల్లో పాల్గొన్న బృందాలకు ఆయన కంగ్రాట్స్ చెప్పారు. దేశ రక్షణ సామర్థ్యాన్ని పెంచే కీలకమైన టెక్నాలజీ పరీక్షలను భారత్ విజయవంతంగా చేపట్టినట్లు ఆయన తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నారు. విభిన్న రకాల శత్రువులను ఎదుర్కొన్న రీతిలో ఆ రక్షణ పరీక్షలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లు, యాంటీ షిప్ మీడియం రేంజ్ సామర్ధ్యాన్ని పరీక్షించినట్లు ఆయన చెప్పారు. బీఎండీ పరీక్షలో భాగంగా ఇంటర్‌సెప్టార్లు కచ్చితత్వంతో టార్గెట్లను చేధించినట్లు తెలిపారు. ఐసీబీఎంలను కూడా ఎదుర్కొనే సామర్థ్యం భారత్ వద్ద ఉందన్నారు.
The @DRDO_India has successfully demonstrated multiple crucial technologies bolstering nations defence capabilities against different types of enemy threats.
Three consecutive flight-tests were successfully conducted to demonstrate multi-layered defence against long range… pic.twitter.com/0DKQF0LB30
— Rajnath Singh (@rajnathsingh) June 13, 2026