Donald Trump | బీహార్‌లో నివాసముంటున్న ట్రంప్.. రెసిడెంట్ సర్టిఫికెట్ కోసం అమెరికా అధ్యక్షుడి దరఖాస్తు
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నివాస ధృవీకరణ పత్రం (Residence Certificate) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతీకార సుంకాలతో భారత్‌పై విరుచుకుపుడుతున్న ట్రంప్.. బీహార్‌లో ఎప్పటి నుంచి నివసిస్తున్నారని అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం.
పాట్నా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నివాస ధృవీకరణ పత్రం (Residence Certificate) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రతీకార సుంకాలతో భారత్‌పై విరుచుకుపుడుతున్న ట్రంప్.. బీహార్‌లో ఎప్పటి నుంచి నివసిస్తున్నారని అనుకుంటున్నారా.. కానీ ఇది నిజం. ట్రంప్ పేరుతో రెసిడెంట్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో ఓ దరఖాస్తు వచ్చింది. అప్లికేషన్‌ను పరిశీలించిన అధికారులు దానిని తిరస్కరించారు.
బీహార్ అధికారులు ఇటీవల ఓ శునకానికి డాగ్ బాబు పేరుతో నివాస ధృవీకరణ పత్రం జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్‌కు కూడా రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇప్పిందామని అనుకున్నాడో వ్యక్తి.. ఇంకేముంది అమెరికా అధ్యక్షుడికి నివాస ధృవీకర పత్రం కోసం దరఖాస్తు చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సమస్తీపుర్ జిల్లాలోని మొహియుద్దీన్నగర్ బ్లాకు ప్రభుత్వ పోర్టల్‌లో ట్రంప్ పేరు, ఫొటోతో ఉన్న దరఖాస్తు ఓటరు జాబితా సమగ్ర సవరణ (SRI)తో బిజీగా ఉన్న అధికారుల కంటో పడింది. హసన్‌పూర్‌లో ట్రంప్ నివసిస్తున్నట్లుగా అప్లికేషన్లో పేర్కొనడం చూసిన అధికారులు.. దానిని తిరస్కరించారు. జూలై 29న వచ్చిన ఈ దరఖాస్తులో ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడరిక్ క్రిస్ట్ అని, తల్లి మేరీ మెక్లాయిడ్ అని పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఐటీ చట్టం కింద కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Bihar | An application was given in Samastipur to make a residence certificate in the name of US President Donald Trump. (06/08) pic.twitter.com/SfW3dtPf2W
— ANI (@ANI) August 6, 2025
ఇవి కూడా చదవండి..
కుక్కకు రెసిడెన్సీ సర్టిఫికెట్!
Trump Trariff s | ట్రంప్ అదనపు సుంకాలు.. ప్రభావం వేటిపై అంటే..
సంతానోత్పత్తిపై స్మార్ట్‌ఫోన్ ఎఫెక్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

