అమెరికా చదువులకు కోటి రూపాయల కండిషన్
అమెరికాలో చదువు పూర్తిచేసుకుని, అక్కడే ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్'(ఓపీటీ) వీసా దరఖాస్తులపై లక్ష డాలర్లు(సుమారు రూ. ఒక కోటి)ఫీజు విధించే అంశాన్ని ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్తలు భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
- ట్రంప్ కొత్త వీసా నిబంధనలతో భారత విద్యార్థుల్లో వణుకు
న్యూఢిల్లీ: అమెరికాలో చదువు పూర్తిచేసుకుని, అక్కడే ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్'(ఓపీటీ) వీసా దరఖాస్తులపై లక్ష డాలర్లు(సుమారు రూ. ఒక కోటి)ఫీజు విధించే అంశాన్ని ట్రంప్ యంత్రాంగం పరిశీలిస్తున్నట్టు వచ్చిన వార్తలు భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, అమెరికాలో ఉన్న సుమారు రూ.3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నది. హెచ్-1వీ వీసాలపై ఇలాంటి ఫీజును విధించేందుకు గతంలో తెచ్చిన ప్రతిపాదనను ఒక అమెరికా కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇప్పుడు ఓపీటీ కార్యక్రమంపై దృష్టి సారించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలో ఉన్నది.
భారీ ఫీజు చట్టరూపం దాలిస్తే తాము చెల్లించలేమని పలువురు భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలో డేటా సైన్స్ అభ్యసిస్తున్న కేరళకు చెందిన ఒక పీహెచ్డీ విద్యార్థి మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్ తర్వాత అనుభవం సంపాదించేందుకు ఓపీటీ అత్యంత కీలకమని, అయితే లక్ష డాలర్లు చెల్లించడం తనలాంటి చాలామంది విద్యార్థులకు అసాధ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైవు ఉద్యోగుల తరపున కంపెనీలు ఈ ఫీజు చెల్లించేందుకు అనుమతించినప్పటికీ, పలు సంస్థలు ఇందుకు ముందుకు రాకపోవచ్చని నిపుణలు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

