Surgical Scissors: గుండె సర్జరీ చేసి సీజర్స్‌ను శరీరంలోనే వదిలేశారు.. డాక్టర్లపై ఫిర్యాదు
Surgical Scissors: గుండె సర్జరీ చేసిన డాక్టర్లు శరీరంలోనే సర్జికల్ కత్తుల్ని వదిలివేసినట్లు రాజస్థాన్‌కు చెందిన కుటుంబం ఆరోపించింది. జైపూర్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయినట్లు ఓ వ్యక్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. చితాభస్మం కోసం శ్మశానవాటిక వెళ్లిన సమయంలో సీజర్స్ దొరికినట్లు ఆరోపించారు.
జైపూర్: గుండె సర్జరీ చేసిన డాక్టర్లు శరీరంలోనే సర్జికల్ కత్తుల్ని(Surgical Scissors) వదిలివేసినట్లు రాజస్థాన్‌కు చెందిన కుటుంబం ఆరోపించింది. జైపూర్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే తమ తండ్రి చనిపోయినట్లు ఓ వ్యక్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఆపరేషన్ తర్వాత తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, సర్జరీ జరిగిన 12 రోజుల తర్వాత అతను చనిపోయాడని, దహనం తర్వాత చితాభస్మం కోసం శ్మశానవాటికకు వెళ్తే ఆ ప్రాంతంలో సర్జికల్ కత్తులు దొరికినట్లు ఆ వ్యక్తి ఆరోపించాడు. ఆ కుటుంబం హాస్పిటల్‌కు ఫిర్యాదు చేస్తే వాళ్లు ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. జవహార్ సర్కిల్ పోలీసు స్టేషన్లో ఆ ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది.
నగరంలోని మాన్సరోవర్ ఏరియాకు చెందిన కమల్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు ఇచ్చాడు. ఫోర్టిస్ హాస్పిటల్ జోనల్ డైరెక్టర్ నీరవ్ భన్సల్ ఆ ఆరోపణలను కొట్టిపారేశారు. తమ వద్ద సర్జరీ జరిగిన తర్వాత ఎక్స్‌రే రిపోర్టులు ఉన్నాయన్నారు. చనిపోయిన వ్యక్తి శరీరంలో ఎటువంటి సర్జికల్ వస్తువులు లేవన్నారు. అయితే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా ఆధర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఫిర్యాదుపై కమిటీ దర్యాప్తు చేపట్టనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

