DMK minister : డీఎంకే (DMK) పార్టీని చిత్తుగా ఓడిస్తానని, ఆ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తానని టీవీకే చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) చేస్తున్న ప్రగల్భాలను చూసి జనం నవ్వుకుంటున్నారని తమిళనాడు (Tamil Nadu) న్యాయశాఖ మంత్రి (Law Minister) రఘుపతి (Raghupati) విమర్శించారు. పుదుకోటలో సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీవీకే (TVK) తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదన్నారు.
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 75 ఏళ్లుగా సుస్థిరమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న డీఎంకేని పత్తాలేకుండా చేస్తామని బెదిరించిన రాజకీయ దిగ్గజాలంతా పత్తాలేకుండా పోయారనే విషయం విజయ్‌కి తెలియడం లేదని వ్యాఖ్యానించారు. డీఎంకేతో తలపడితే టీవీకే చిత్తుగా ఓడిపోతుందన్నారు. ప్రచార సభలలో చిన్న తొక్కిసలాట జరిగితే విజయ్‌లా పారిపోయే నేతలెవరూ డీఎంకేలో లేరన్నారు. అటు అన్నాడీఎంకేని, ఇటు బీజేపీని విమర్శించని టీవీకే.. బీజేపీకి సీ-టీమ్‌లా వ్యవహరిస్తోందని విమర్శించారు.