డీఎంకే ఎమ్మెల్యేలతో రేపు సాయంత్రం స్టాలిన్ సమావేశం..
డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం | డీఎంకే అధినేత స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో స్టాలిన్‌ను తమ శాసనసభ పక్షనేతగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది.

చెన్నై : డీఎంకే అధినేత స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో స్టాలిన్‌ను తమ శాసనసభ పక్షనేతగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది.
రేపు సాయంత్రం 6 గంటలకు అరివాలయం కలైగ్నార్ అరంగంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుందని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ తెలిపారు.
పార్టీ తరఫున నూతనంగా ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే సమావేశానికి తప్పక హాజరుకావాలని పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే సూచించారు.
తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్న స్టాలిన్ సమర్థవంతంగా పార్టీని నడిపించి ఎన్నికల్లో విజయ తీరాలకు చేర్చారు.
ఈ నెల 7న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆనంద వ్యక్తమవుతున్నది. 234 స్థానాలున్నతమిళనాడు శాసనసభకు గత నెల 6న ఎన్నికలు జరిగాయి.
ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడగా డీఎంకే 133 స్థానాల్లో జయకేతనం ఎగురువేసి అధికారాన్ని కైవశం చేసుకుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

