చెన్నై : ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరగబడండి అన్న వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఒకరోజు ఎన్నిక ప్రచారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయాన్ని నిరసిస్తూ మమతా బెనర్జీ కోల్కతాలోని గాంధీ విగ్రహం ముందు బైటాయించారు. దీనిపై మమతా బెనర్జీకి మద్దతుగా డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ఎన్నికల సంఘం అన్ని పార్టీలను ఒకేరీతిగా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో అందరికీ ప్రచార అవకాశం కల్పించాలన్నారు. మన ప్రజాస్వామ్య మనుగడ స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల నిర్వహణపైనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ.. పోల్ ప్యానెల్ బీజేపీ వింగ్ లాగా ప్రవర్తిస్తోందన్నారు.
The faith in our democracy rests on free and fair elections.
— M.K.Stalin (@mkstalin) April 13, 2021
The Election Commission of India must ensure a level playing field for all parties and candidates and ensure that impartiality and neutrality is maintained.#MamataBanerjee