చెన్నై: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే జోరుగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో డీఎంకే, ఏఐఏడీఎంకేలు అధికారం కోసం చేతులు కలుపుతాయన్న ప్రచారం జోరందుకుంది. అయితే దీనిని రెండు పార్టీలు ఖండించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించకపోవడం వల్లే ఈ ప్రచారం మొదలైందని ఏఐఏడీఎంకే మాజీ ఎంపీ పళనిస్వామి అభిప్రాయ పడ్డారు.
రెండు పార్టీలు కలిసే అంశంలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని, ఒక వేళ పొత్తుకు ఏదైనా అవకాశం ఉంటే ఫలితాలు వెలువడిన వెంటనే సంప్రదింపులు జరిపి ఉండేవారని డీఎంకే నేత మాధివనన్ పేర్కొన్నారు.