న్యూఢిల్లీ: భారత ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకునే దివ్వెల పండుగ దీపావళికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. యునెస్కో అభౌతిక సాంస్కృతిక వారసత్వ జాబితాలో ఈ పండుగ చేరింది. తొలిసారి మన దేశ ఆతిథ్యంలో ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన యునెస్కో కమిటీ సమావేశంలో ఈ శాసనం గురించి ప్రకటన వెలువడింది.ఇది వెలువడిన వెంటనే వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలు మిన్నంటాయి. భారత దేశ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచానికి బలంగా ప్రదర్శించడానికి డిసెంబర్ 10న ప్రత్యేక దీపావళి వేడుకలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళితో కలిపి భారత్లో 16 సంప్రదాయాలకు వారసత్వ గుర్తింపు వచ్చింది.