Diwali Crackers | దీపావళి రోజున దేశవ్యాప్తంగా పటాకుల మోత మోగింది. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి బాంబులు కాల్చారు. యావత్ దేశవ్యాప్తంగా దీపావళి ఒకేరోజున 62వేల టన్నుల మందుగుండు సామగ్రిని ఉపయోగించారు. పర్యావరణ సంస్థ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ECIU), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా పేర్కొంది. గతేడాది పోలిస్తే దాదాపు 13శాతం ఎక్కువగా ఉందని తెలిపింది. రష్యా-క్రెయిన్ యుద్ధంతో పోలిస్తే ఒకే దీపావళి రోజు రాత్రి కాల్చిన మందుగుండు సామగ్రి.. ఆ యుద్ధంలో మూడురోజులు ఉపయోగించిన బాంబులకు సమానం.
ప్రపంచ పర్యావరణ సంస్థ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రకారం.. వివిధ జాతీయ, అంతర్జాతీయ అంచనాలు దీపావళికి గన్‌పౌడర్ వినియోగం అపూర్వమైందని సూచిస్తున్నాయి. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ డేటా ఆధారంగా బాణాసంచ తయారీలో మాత్రమే ఉపయోగించిన గన్‌పౌడర్ మొత్తం 62వేల టన్నులుగా అంచనా. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబయి, చెన్నై, జైపూర్ సహా 12 కీలక నగరాలను కవర్ చేస్తూ ఈసీఐయూ జరిపిన సర్వేలో 61,500 నుంచి 63వేల టన్నుల వరకు పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లుగా పేర్కొంది. ఇదిలా ఉండగా.. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NEERI) ప్రాథమిక రసాయన డేటా ఆధారంగా ఈ సంఖ్యను దాదాపు 59వేల టన్నులు. సగటున దీపావళి సందర్భంగా దాదాపు 62వేలు టన్నుల గన్‌పౌడర్‌ను కాల్చారు. ఈ గణాంకాలు పూర్తి వివరాలు నవంబర్‌లో వెల్లడవనున్నాయి.
స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI), రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ (RUSI) ప్రకారం.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ రంగంలో రోజుకు సగటున 20వేల నుంచి 21వేల టన్నుల పేలుడు పదార్థాలు ఉపయోగిస్తున్నారు. భారత్‌లో దీపావళి ఒకే రోజున కాల్చిన గన్‌పౌడర్ మొత్తం దాదాపు మూడు రోజుల యుద్ధంలో బాబు దాడులకు ఉపయోగించిన దానితో సమానం. దీని అర్థం దీపావళి వేడుకలు ఒకే రాత్రి యుద్ధంలో మొత్తం గన్‌పౌడర్ వినియోగం కంటే దాదాపు మూడు రెట్లు (295శాతం) ఎక్కువ. ఈసీఐయూ అంచనా ప్రకారం.. రసాయనికంగా దీపావళి టపాసులు, యుద్ధంలో మందుగుండుకు చాలా లోకి ఉంటుంది. రెండింట్లో అధిక ఉష్ణోగ్రత, మెటల్ సమ్మేళనాలు ఉండడంతో పాటు విష వాయువులను విడుదల చేస్తాయి.
బాణాసంచా ద్వారా ఉత్పత్తి అయ్యే సగటు ఉష్ణోగ్రత 1,400 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటుంది. అయితే, ఫిరంగులు, బాంబుల పేలుళ్లతో 2,800 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను ఉత్పత్తి అవుతుంది. దీపావళి రాత్రి వాతావరణంలోకి 4.2 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలైంది. అయితే సగటున యుద్ధంలో రోజుకు 1.9 లక్షల టన్నులు విడుదలవుతాయి. దీపావళి బాణాసంచా నుంచి వెలువడే పొగ సగటున 36 నుంచి 48 గంటల పాటు వాతావరణంలో ఉంటుంది. అయితే, గత సంవత్సరం ఢిల్లీ ఎన్సీఆర్, కాన్పూర్, జైపూర్ వంటి జనసాంద్రత కలిగిన నగరాల్లో దాని ప్రభావం మూడురోజుల పాటు ఉన్నది. ఈ పొగలో ఉండే సూక్ష్మ కణాలు (PM 2.5, PM 10), సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ గాలిలోని తేమతో కలిసి పొగమంచును ఏర్పరుస్తాయి. ఎన్ఈఈఆర్ఐ (NEERI) ప్రకారం.. దీపావళి తర్వాత వాయు నాణ్యత సూచి సాధారణ స్థాయికి తిరిగి రావడానికి కనీసం 48 గంటలు పడుతుంది.