Ditwa Cyclone | తీరం దాటనున్న దిత్వా తుఫాన్.. ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో రెడ్ అలర్ట్..!
Ditwa Cyclone : శ్రీలంకలో విధ్వంసం సృష్టిస్తున్న దిత్వా తుఫాన్ (Ditwa Cyclone) భారత్‌లోని తీరప్రాంతాలను ముంచెత్తనుంది. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది.
Ditwa Cyclone : శ్రీలంకలో విధ్వంసం సృష్టిస్తున్న దిత్వా తుఫాన్ (Ditwa Cyclone) భారత్‌లోని తీరప్రాంతాలను ముంచెత్తనుంది. రాబోయే 24 గంటల్లో ఈ తుఫాన్ తమిళనాడు, పుదుచ్ఛేరి, ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటనుంది. శ్రీలంకలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టానికి కారణమైన ఈ తుఫాన్ నవంబర్ 30 ఉదయానికల్లా తీరం దాటే అవకాశముంది. అందుకని ఈ రెండు రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతానికి భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ ప్రస్తుతం ఉత్తరం, వాయువ్యం దిశగా దూసుకొస్తుంది. దాంతో.. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన పొంచి ఉంది. నవంబర్ 30న దిత్వా తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలో జాతీయ విపత్తు నియంత్రణ బృందాలు రంగంలోకి దిగాయి.
— IMD-Tamilnadu Weather (@ChennaiRmc) November 29, 2025
దిత్వా తుఫాన్ శ్రీలంక జనజీవితాన్ని అతలాకుతలం చేసింది. ఇప్పటికే లంకలో వరద విలయానికి 132 మంది మరణించగా.. 171 మంది గల్లంతవ్వగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలు స్తంభించాయి. చాలాచోట్ల జనం ఇళ్ల పైకప్పు ఎక్కి.. చెట్లు ఎక్కి సాయం కోసం అర్ధిస్తున్నారు. దాంతో.. వరదలో చిక్కుకున్న వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Soul breaking scenes from Sri Lanka.
Distressed elephants can be seen trying to escape the rising water levels due to floods caused by cyclone Ditwa. 😢😢 pic.twitter.com/JsOIcaomiM
— Instant Info (@InstantInfo07) November 29, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

