ఇండోర్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఇటీవల ప్రియాంక కడమ్ అనే మహిళ .. దివ్యాంగ కోటాలో ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపికైంది. అయితే ఆమె ఎంపిక పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆమె ఓ ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఎలా ఆమెకు దివ్యాంగ కోటాలో ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని ఓ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
తన నియామకంలో ఎటువంటి అక్రమం జరగలేదని ఆ మహిళ పేర్కొన్నది. 45 శాతం డిజైబులిటీతో బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది. ఎముకల సంబంధిత వ్యాధి ఉన్నట్లు పేర్కొన్నది. కొంత వరకు నడవగలను, కొన్ని డ్యాన్స్ స్టెప్పులు కూడా వేయగలనని ఆమె చెప్పింది. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన పరీక్షలో ఆమె ఉత్తీర్ణురాలై ఉద్యోగం సంపాదించింది. అయితే దివ్యాంగ కోటా కింద ఆమె సెలెక్ట్ అయ్యింది. గత నెలలో ఫలితాలు ప్రకటించగా ఆమె జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్‌గా జాబ్ కొట్టింది.
కానీ సోషల్ మీడియాలో ఆ అమ్మాయి డ్యాన్స్ వీడియోలు వైరల్ కావడంతో ఆమెకు ఎలా దివ్యాంగ కోటా వర్తిస్తుందని విమర్శలు వచ్చాయి. దివ్యాంగ కోటాలో ఎంపికైన వారు భోపాల్ ఎయిమ్స్‌లో పరీక్ష చేయించుకోవాల్సి ఉటుంది. అక్కడ డాక్టర్లు ద్రువీకరించిన తర్వాతే ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది. 2017లో బాత్రూమ్లో పడడం వల్ల తన తొంటికి గాయమైందని, ఎంఆర్ఐ స్కానింగ్‌లో తనకు ఎవాస్కూలార్ నెక్రోసిస్ ఉన్నట్లు గుర్తించారని చెప్పింది.
తనకు నాలుగు సార్లు శస్త్రచికిత్స జరిగిందన్నారు. చూడటానికి సాధారణ మహిళలా ఉన్నా.. సర్జరీలో అమర్చిన ఇంప్లాట్స్ వల్ల తాను నడవగలుగుతున్నట్లు చెప్పింది. 5 నుంచి 10 నిమిషాల మధ్య డ్యాన్స్ కూడా చేయగలనని పేర్కొన్నది. ఉజ్జెయిన్‌లోని ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్‌గా పోస్టు చేశారు.
मैडम प्रियंका कदम को कुछ लोग MPPSC में दिव्यांग कोट के गलत इस्तेमाल के तौर पर पेश कर रहे हैं.
साथ ही उनके जैसी दिखने वाली लड़की डांस करने का वीडियो वायर कर रहे हैं.
आप लंगड़ाकर चलके दिखाएं और ऐसे लोगों के मुंह पर तमाचा लगाएं.#MPPSC #PriyankaKadam #Dance #MadhyaPradesh #MPNews pic.twitter.com/STRhDTYIBP— Siddharth Purohit (@sidpvishnu) February 14, 2025