న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో డిజిటల్ అవతార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆ యాప్ మాతృ సంస్థ మెటా వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బెర్గ్ ప్రకటించారు. తద్వారా వాట్సాప్ వినియోగదారులు తమ పర్సనలైజ్డ్ అవతార్లను ప్రొఫైల్ ఫొటోలుగా, చాట్స్‌లో స్టిక్కర్లుగా ఉపయోగించుకోవచ్చని లేదా వివిధ రకాల భావోద్వేగాలను ఒలికించే 36 రకాల స్టిక్కర్లలో వేటినైనా ఎంచుకోవచ్చని తెలిపారు. అవతార్ అంటే మన స్వరూపాన్ని డిజిటల్ వెర్షన్లో సృష్టించుకోవడమే. కోట్ల రకాల హెయిర్ ైస్టెల్స్, ఫేషియల్ ఫీచర్స్, అవుట్ఫిట్ల కలయికతో ఇది సృష్టించబడుతుంది. అవతార్లను పంపడం ద్వారా మన భావోద్వేగాలను స్నేహితులు, కుటుంబసభ్యులతో వేగంగా, చమత్కారంగా పంచుకోవచ్చు.