ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈనెల 13వ తేదీ నుంచి మహాకుంభ మేళా(Prayagraj Maha Kumbh) జరగనున్నది. త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించనున్న నేపథ్యంలో .. అక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రకరకాల సాధువులు, బాబాలు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటారు. దిగంబర హరివంశ గిరి బాబా కూడా చేరుకున్నాడు. హరివంశ బాబా గత అయిదేళ్ల నుంచి తన ఎడమ చేతిని లేపి ఉంచారు. 12 ఏళ్ల పాటు తన చేయిని లేపి ఉంచాలని దీక్ష పూనినట్లు ఆయన చెప్పారు. అభివృద్ధి పథంలో దేశం వెళ్తుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నేతలు, ఆఫీసర్లు చాలా వివేకంతో వ్యవహారిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. సనాతన ధర్మానికి ఆరంభం, అంతం లేదని, దాని గురించి ఏమీ చెప్పలేనన్నారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Digamber Hariwansh Giri has kept his hand raised for the last 5 years and has resolved to keep it the same way for a total of 12 years. pic.twitter.com/km36B35TSw
— ANI (@ANI) January 6, 2025
అంబాసిడర్ బాబాగా ప్రఖ్యాతిగాంచిన మహంత్ రాజ్ గిరి నాగా బాబా కూడా ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి వచ్చినట్లు ఆయన చెబుతున్నారు. 1972 నాటి మోడల్ కారులో తాను కుంభమేళాకు విజిట్ చేస్తున్నట్లు చెప్పారు. గతంలో నాలుగుసార్లు ఇదే కారులో కుంభమేళాకు వచ్చినట్లు తెలిపారు. ఎక్కడికి వెళ్లాలన్నా ఈ కారు తనకు సహకరిస్తుందన్నారు. కారే ఇళ్లు లాంటిందన్నారు. గడిచిన 35 ఏళ్ల నుంచి ఆ కారు తనవద్దే ఉందన్నారు.
#WATCH | Prayagraj, Uttar Pradesh: Mahant Raj Giri Naga Baba, also known as Ambassador Baba says, “I have come from Indore, Madhya Pradesh… I have visited the Kumbh Mela 4 times in this car. It allows me to go wherever I want. It is like my home… It is a 1972 model car and I… pic.twitter.com/37NC9IvOYy
— ANI (@ANI) January 6, 2025