న్యూఢిల్లీ : చక్కెర ఉండే కూల్‌డ్రింక్స్ అమ్మకాలు గణనీయంగా పడిపోవటంతో పెప్సికో, కోకాకోలా కంపెనీలు కొత్త అవతారం ఎత్తాయి. డైట్ డ్రింక్స్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడే ఆస్పర్టేమ్తో క్యాన్సర్ వస్తుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినా.. ఈ రెండు కంపెనీలు దాన్ని కొట్టిపారేస్తున్నాయి. ప్రతి మనిషికి శరీరంలో ఆస్పర్టేమ్ అవసరమని, అయితే ఎంత మోతాదులో వాడితే శరీరానికి నష్టమో డబ్ల్యూహెచ్‌వో సూచించలేదని వినియోగదారులకు వివరిస్తున్నాయి. డైట్ డ్రింక్స్ అమ్మకాలతో పెప్సికో కంపెనీకి భారత్‌లో అతిపెద్ద డీలర్ అయిన వరుణ్ బెవరేజెస్ 2022 ఆర్థిక సంవత్సరంలో 13,173 కోట్ల రెవెన్యూ సాధించగా.. అది 2023 ఆర్థిక సంవత్సరంలో 13,424 కోట్లకు పెరగ్గా.. కోకాకోలా రెవెన్యూలో గత ఏడాదితో పోలిస్తే 35 శాతం వృద్ధి నమోదైంది.