న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నోరు జారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం ఓటమిని అంగీకరించారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ సహా సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ లాంటి ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు.
‘రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఓటమి తప్పదు’ అని విలేకర్ల సాక్షిగా నోరుజారారు. దీంతో పక్కనున్న పార్టీ నేతలు, విలేకర్లు ఆయా రాష్ర్టాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని గుర్తుచేయడంతో నాలుక కర్చుకున్నారు.