బిజ్నర్: ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన యూపీలోని నాథూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ఓమ్ కుమార్ ఓటర్లపై విరుచుకుపడ్డారు. ‘నాకు ఈసారి ఓటేయని ప్రజలను మరోసారి ఓటేయమని అడగడం, వారి పట్ల వివక్ష లేకుండా పని చేస్తానని చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడు మీరు నాకు ఓటేయకపోతే నేను మీ కోసం పని చేయను’ అని ఓ కార్యక్రమంలో ఆయన అన్న మాటలు వైరల్గా మారాయి. ఈ సందర్భంగా కుమార్ అధికారులను కూడా హెచ్చరించారు. ‘నా కార్యకర్తలను గౌరవించని అధికారులు జిల్లాలో ఉండటానికి అనుమతించను’ అని ఆయన అన్నారు.
‘ జనాభా నియంత్రణ పాలసీ అవసరం’
న్యూఢిల్లీ: దేశంలో ముస్లిం జనాభా పెరుగుదలపై ఆరెస్సెస్ మ్యాగజైన్ ఆర్గనైజర్ ఆందోళన వ్యక్తం చేసింది. సమగ్ర జాతీయ జనాభా నియంత్రణ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పింది. పలు ప్రాంతాల్లో ముస్లింల జనాభా గణనీయంగా పెరుగుతున్నదని, దీంతో జనాభా అసమతుల్యత ఏర్పడుతున్నదని పేర్కొన్నది. సరిహద్దుల్లో అక్రమ వలసల వల్ల కూడా జనాభా పెరుగుదల నమోదవుతున్నదని తెలిపింది.