DGCA | భారత్‌కు చెందిన విమానాలకు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ విషయంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో దాయాది దేశం సైతం విమానాలకు గగనతలాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో విమానయాన రంగంతో పాటు ఉత్తర భారతం నుంచి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ప్రయాణ దూరం, సమయం పెరుగనున్న నేపథ్యంలో డీజీసీఏ విమానయాన సంస్థలు, ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
పాక్ గగనతలం అందుబాటులో లేకపోవడంతో విమానాలను ప్రత్యామ్నాయ, సుధీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుందని.. దాంతో ప్రయాణ సమయం పెరుగుతుందని.. ఇంధనం నింపుకునేందుకు, సిబ్బందిని సైతం మార్చేందుకు టెక్నికల్ స్టాప్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చని హెచ్చరించింది. ఈ సమయాల్లో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని.. సుదీర్ఘ ప్రయాణ సమయానికి అనుగుణంగా ఆయా విమానాల్లో అదనంగా ఆహారం, డింక్స్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పింది. అత్యవసర వైద్య సదుపాయాలు ఉండేలా చూసుకోవడంతో పాటు సిబ్బంది అప్రమత్తతపై దృష్టి పెట్టాలని చెప్పింది. అయితే, ఢిల్లీ, అమృత్‌నగర్ తదితర ఉత్తరాది నగరాల నుంచి యూఏఈ, యూరప్, యూకే, ఉత్తర అమెరికాకు వెళ్లే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా విమానాలు ఇకపై ముంబయి, అహ్మదాబాద్ మీదుగా అరేబియా సముద్రం మీద నుంచి మస్కట్ వైపు మళ్లాల్సి ఉంటుంది.
ఈ మార్గంలో ఎదురుగాలులు వీస్తాయని.. దాంతో ప్రయాణ సమయంలో మరింత పెరుగుతుందని పైలెట్లు పేర్కొంటున్నారు. తద్వారా ఎయిర్‌లైన్ కంపెనీలకు నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అదనంగా ఇంధనం, అదనపు ల్యాండింగ్ ఛార్జీలు, సిబ్బంది ఖర్చుతులు సైతం ఎక్కువగా కానున్నాయి. సుదూర ప్రాంతాలకు సర్వీసులు నడిపే ఎయిర్ ఇండియాపై అదనంగా భారం పడే అవకాశాలున్నాయి. ప్రయాణ సమయం, దూరం పెరిగిన నేపథ్యంలో పలు అంతర్జాతీయ సర్వీసులను ఇండిగో తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అదనపు చార్జీల భారం ప్రయాణికులపై పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా బుక్ చేసే టికెట్లపై 30 నుంచి 40శాతం వరకు ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.