బెంగళూరు, మే 23: ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబానికి పెద్ద తలనొప్పిగా మారింది. దౌత్య పాస్‌పోర్ట్‌పై విదేశాలకు పారిపోయిన మనుమడు ప్రజ్వల్‌కు దేవెగౌడ హెచ్చరిక జారీచేశారు. తన సహనాన్ని పరీక్షించొద్దని, భారత్‌కు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలని స్పష్టంచేశారు. తన మాటల్ని లెక్కచేయకపోతే తనతోపాటు కుటుంబ సభ్యులందరి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. గురువారం ఆయన ఈమేరకు ‘ఎక్స్’లో ఓ లేఖను పోస్ట్ చేశారు.