Haldiram’s | న్యూఢిల్లీ: భారతీయులు స్వదేశీ ఆహారానికే పెద్ద పీట వేస్తుండటంతో పెప్సికో వంటి పాశ్చాత్య కంపెనీలు మార్కెట్లో వెనుకంజలో ఉన్నాయి. స్వదేశీ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్న హల్దీరామ్స్ వంటి స్వదేశీ కంపెనీలు పైచేయి సాధిస్తున్నాయి.
2023 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హల్దీరామ్స్ ప్యాకేజ్డ్ స్నాక్స్ అమ్మకాలు అంతకు ముందు ఏడాది కన్నా 19 శాతం వృద్ధి చెంది, రూ.9,215 కోట్లకు చేరుకున్నాయి. పెప్సీకో కంపెనీ స్నాక్స్ అమ్మకాలు రూ.6,430 కోట్లకు పరిమితమయ్యాయి.