న్యూఢిల్లీ: రేప్ కేసుల్లో నిందితుడు డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ ప్రస్తుతం పెరోల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జైలు నుంచి రిలీజైన అతను.. ఇవాళ బర్త్‌డే వేడుకల్ని నిర్వహించారు. 40 రోజుల పెరోల్‌పై ఉన్న గుర్మీత్.. ఓ పెద్ద తల్వార్‌తో బర్త్‌డే కేక్‌ను కట్ చేశారు. వివిధ రేప్, మర్డర్ కేసుల్లో గుర్మీత్ 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. హర్యానాలోని రోహతక్‌లో ఉన్న సునరియా జైలులో అతను శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే పెరోల్‌పై రిలీజైన తర్వాత యూపీలోని బర్నావా ఆశ్రమానికి ఆయన చేరుకున్నారు.
డేరా మాజీ చీఫ్ షా సత్నామ్ సింగ్ పుట్టిన రోజు జరుపుకునేందుకు పెరోల్ కావాలని తన బెయిల్ అప్లికేషన్లో రామ్ రహీమ్ పేర్కొన్నాడు. అయితే ఇవాళ గుర్మీత్ కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయిదేళ్ల తర్వాత తనకు కేక్ కట్ చేసే అవకాశం వచ్చిందని, కనీసం అయిదు కేక్‌లు కట్ చేయాలని గుర్మీత్ పేర్కొన్నాడు. ఇది ఫస్ట్ కేక్ అని తెలిపాడు.
కానీ తల్వార్‌తో కేక్ కట్ చేయడం వివాదాస్పదమైంది. ఆయుధ చట్టాల ప్రకారం తల్వార్ కత్తితో కేక్‌ను కట్ చేయడం నిషేధం.