Dera chief shot dead | ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్ కాల్పుల్లో మృతి.. వీడియో వైరల్
Dera chief shot dead | ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. (Dera chief shot dead) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్-తనక్‌పూర్ మార్గంలో నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఉన్నది. సిక్కుల పుణ్యక్షేత్రానికి బాబా టార్సెమ్ సింగ్ డేరా చీఫ్‌గా ఉన్నారు.
కాగా, గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడకు వచ్చారు. కుర్చీలో కూర్చొని ఉన్న డేరా చీఫ్ బాబా టార్సెమ్ సింగ్‌పై గన్‌తో కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్ర బుల్లెట్ గాయాలతో ఆయన కిందపడిపోయారు. గమనించిన అనుచరులు బాబా టార్సెమ్ సింగ్‌ను వెంటనే ఖతిమాలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆ గురుద్వారా వద్ద అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. శాంతి వహించాలని సిక్కు ప్రజలకు పిలుపునిచ్చారు. హంతకులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, ఆ ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన కాల్పుల వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
The dera chief of the Nanakmatta Sahib Gurdwara in #Uttarakhand was shot dead within the premises of the shrine by two bike-borne assailants early Thursday, police said. The incident was caught on CCTV. pic.twitter.com/E7PUzQSQGa
— Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) March 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gyanesh Kumar | జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. ఒక్కరిని కాపాడేందుకు ఎందుకీ తాపత్రయం?: కేటీఆర్
CJP Protest | జంతర్ మంతర్ 2.0తో హైఅలర్ట్.. సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత, ఇంటర్నెట్ సేవలు బంద్!
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

