Justice Bela Trivedi | జస్టిస్ బేలాకు దక్కని ‘వీడ్కోలు’!.. సీజేఐ గవాయ్ అసంతృప్తి
పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీకి వీడ్కోలు దక్కకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవీ విమరణ చేసే న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ.
- ఎస్సీబీఏ తీరును తప్పుబట్టిన సీజేఐ
Justice Bela Trivedi | న్యూఢిల్లీ : పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేదీకి వీడ్కోలు దక్కకపోవడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పదవీ విమరణ చేసే న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అయితే, జస్టిస్ బేలా త్రివేదీ కోసం అలాంటి కార్యక్రమాన్ని ప్రకటించకపోవడాన్ని సీజేఐ గవాయ్ శుక్రవారం తీవ్రంగా విమర్శించారు. ‘అసోసియేషన్ తీసుకున్న నిర్ణయాన్ని నేను బహిరంగంగా ఖండిస్తున్నాను.
ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం తగదు’ అని పేర్కొన్నారు. జస్టిస్ మాసిహ్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించారు. వీడ్కోలు సభ ఏర్పాటు చేయకపోవడంపై తాను చింతిస్తున్నానని, సంప్రదాయాన్ని అనుసరించాల్సిందేనని, దానిని గౌరవించాల్సిందేనని ఆయన నొక్కి చెప్పారు. జస్టిస్ త్రివేదీ లాంటి వారు న్యాయవ్యవస్థకు విలువైన ఆస్తి అని పేర్కొన్న సీజేఐ పేర్కొన్నారు. జస్టిస్ త్రివేదీ కఠినమైన న్యాయమూర్తిగా పేరు పొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

