న్యూఢిల్లీ, మే 16: లోపలి దంతాల్లోని బాక్టీరియాను నిర్మూలించేందుకు బెంగళూరు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అతి చిన్న రోబోల(నానో రోబో)ను తయారు చేశారు. దంతాలను శుభ్రం చేయడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో దోహదం చేస్తాయని తెలిపారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో కూడా లోపలి దంతాల్లో బాక్టీరియా చావదు. అయితే, తాజా రోబోల సాయంతో చికిత్స ద్వారా బాక్టీరియాను పూర్తిగా తొలగించవచ్చని, డెంటల్ ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ వివరాలను అడ్వాన్స్డ్ హెల్త్‌కేర్ మెటీరియల్స్ జర్నల్‌లో ప్రచురించారు.