శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 09, 2020 , 13:51:59

నల్లధనాన్ని తగ్గించేందుకు పెద్దనోట్ల రద్దు అంశం ఏమేర పని చేసింది...?

నల్లధనాన్ని తగ్గించేందుకు పెద్దనోట్ల రద్దు అంశం ఏమేర పని చేసింది...?

హైదరాబాద్ : ప్రధాని మోడీ నాలుగేండ్ల క్రితం నవంబర్ 8వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు పెద్ద నోట్లు అంటే రూ.500, రూ.1000 ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే...  అయితే ప్రధాని ఒక్క ప్రకటనతో నాడు ఎనభై ఆరు శాతంగా ఉన్న కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద  క్యూ కట్టారు. రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత క్రమంగా రూ.500, రూ.2000 నోట్లను తీసుకు వచ్చింది. రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నప్పటికీ వీటి ముద్రణ తగ్గిపోయింది.

పెద్ద నోట్ల రద్దు భావి భారతానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో పాటు డిజిటలైజేషన్‌కు ఎంతగానే దోహదపడుతుందని ఆర్థికవేత్తలు సైతం అభిప్రాయపడ్డారు. అయితే అనూహ్యంగా ఈ నిర్ణయం నేపథ్యంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగిత రేటు నాటికి నాలుగేండ్ల గరిష్టానికి చేరుకున్నది. 2017-18లో 45ఏండ్ల గరిష్టానికి చేరుకుంది. నోట్ల రద్దు వల్ల నాడు ఉద్యోగాలపై, ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే నోట్ల రద్దు నుంచి కోలుకుంటున్న సమయంలో గత ఏడాది మందగమనం, ఇప్పుడు కరోనా దెబ్బ మీద దెబ్బకొట్టినట్లయింది.

నల్లధనాన్ని తగ్గించేందుకు దోహదపడ్డ అంశాలు... 

నోట్ల రద్దు ప్రకటించిన నాలుగేండ్ల తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. అయితే ముందుగా అంచనా వేసినంతగా మాత్రం పెరగలేదని ఆర్ధిక నిపుణులు  చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, కిరాణా సామాగ్రి కొనుగోలుకు చాలా వరకు డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే పౌరులు, ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబాల ఆస్తులను తప్పనిసరిగా బహిర్గతం చేయడం, ఆస్తులతో ఆధార్ లింకింగ్ వంటి అంశాలు నల్లధనాన్ని తగ్గించేందుకు దోహదపడ్డాయి.

రూ.2000 నోట్లను రద్దు చేయాల్సిందేనా..? 

 ఇటీవల విడుదలైన ఓ సర్వే ప్రకారం గత 12 నెలల కాలంలో 34 శాతం మంది తమ నెలవారీ నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం నేరుగా డబ్బు చెల్లించారు. 31 శాతం మంది తమ ఉద్యోగుల వేతనాలను, క్యాష్, పెయిడ్ బిల్స్ రూపంలో ఇచ్చారు. సివిక్ కో-ఆపరేషన్ అనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ 15,000 మందిని సర్వే చేసింది. నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం తీసుకున్న నోట్ల రద్దును సమర్థిస్తూనే, ప్రస్తుతం ఉన్న రూ.2000 నోట్లను కూడా రద్దు చేయాలని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.

 ప్రజల ఆస్తులను మొత్తం ఆధార్ తో లింక్ చేయాలని 23 శాతం మంది, మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, తమ ఆస్తులను ప్రకటించాలని 38 శాతం మంది డిమాండ్ చేశారు. రూ.2000 నోట్లను వెంటనే రద్దు చేయాలని 10 శాతం మంది చెప్పగా. రూ.10,000కు పైగా చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన ప్రభుత్వం వెంటనే 2 శాతం ట్యాక్స్ విధించాలని 7 శాతం మంది సూచించారు. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. జోబైడెన్ గెలుపుతో ఊపందుకున్నఅమెరికా మార్కెట్లు...

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.