ఆ వేరియంట్ వల్లే ఇండియాలో కరోనా సెకండ్ వేవ్: ప్రభుత్వ అధ్యయనం

న్యూఢిల్లీ: ఇండియాలో తొలిసారి కనిపించిన కరోనా వేరియంట్ వల్లే ఇండియాలో సెకండ్ వేవ్ వచ్చిందని ప్రభుత్వ అధ్యయనం తేల్చింది. బీ.1.612.2గా గతంలో పిలిచిన దీనినే ఈ మధ్య డబ్ల్యూహెచ్‌వో డెల్టా వేరియంట్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. యూకేలోని కెంట్‌లో గుర్తించిన ఆల్ఫా వేరియంట్ కంటే కూడా ఇది వేగంగా వ్యాపించిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. ఇండియన్ సార్స్ కొవ్2 జీనోమిక్ కాన్సార్షియా, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ అధ్యయనం నిర్వహించింది.
నిజానికి ఆల్ఫా వేరియంట్ కంటే ఈ డెల్టా వేరియంట్ 50 శాతం ఎక్కువ వ్యాపించిందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది. దేశంలో 12,200 వేరియంట్లు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని, తమ అధ్యయనం కొనసాగుతోందని ఈ సంస్థలు తెలిపాయి. అయితే డెల్టా వేరియంట్‌తో పోలిస్తే.. ఈ వేరియంట్ల ఉనికి చాలా చాలా తక్కువని చెప్పాయి. సెకండ్ వేవ్‌లో అన్ని ఇతర వేరియంట్లను ఈ డెల్టా వేరియంట్ రీప్లేస్ చేసిందని ఈ అధ్యయనం తేల్చింది.
తెలంగాణలోనూ ఎక్కువే
ఈ డెల్టా వేరియంట్ దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కనిపించింది. అయితే ముఖ్యంగా తెలంగాణతోపాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశాల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వ్యాక్సిన్లు వేసుకున్న తర్వాత కూడా వచ్చిన ఇన్ఫెక్షన్లలో ఈ డెల్టా వేరియంట్ ప్రభావమే ఎక్కువగా ఉంది. అదే ఆల్ఫా వేరియంట్ మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రాలేదు. అయితే డెల్టా వేరియంట్ వల్ల ఎక్కువ మరణాలు, వ్యాధి తీవ్రత ఎక్కువైనట్లు మాత్రం నిరూపితం కాలేదు. ఈ అధ్యయనంలో భాగంగా ఇండియాలో చేసిన 29 వేల జీనోమ్ సీక్వెన్సింగ్లను పరిశీలించారు. ఇందులో 8900 శాంపిల్స్‌లో బీ.1.617 కనిపించింది. అందులో డెల్టా వేరియంట్ వెయ్యి శాంపిళ్లలో ఉన్నట్లు గుర్తించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

