Vande Bharat Train | వందే భారత్ ప్రయాణికులకు పాడైన ఆహారం సర్వ్.. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్
Vande Bharat Train | వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రయాణికులకు పాడైన ఆహారం సర్వ్ చేశారు. వాసన వస్తున్న ఆ ఆహారాన్ని తినబోమన్న వారు ఆ ఫుడ్‌ను వెనక్కి ఇచ్చేశారు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులతోపాటు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
న్యూఢిల్లీ: వందే భారత్ రైలు (Vande Bharat Train) ప్రయాణికులకు పాడైన ఆహారం సర్వ్ చేశారు. వాసన వస్తున్న ఆ ఆహారాన్ని తినబోమన్న వారు ఆ ఫుడ్‌ను వెనక్కి ఇచ్చేశారు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులతోపాటు రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఈ సంఘటన జరిగింది. ఆధునాతన, వేగవంతమైన ఈ రైలులో అందించిన ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహారం పాడై వాసన రావడంతో ఫుడ్ ప్లేట్లను నేలపై ఉంచారు. వాటిని వెనక్కి తీసుకోవాలని రైల్వే సిబ్బందిని డిమాండ్ చేశారు.
కాగా, ఒక ప్రయాణికుడు దీనిని వీడియో తీశాడు. పాడైన, వాసన వస్తున్న ఆహారాన్ని సర్వ్ చేయడంపై తోటి ప్రయాణికుల ఆగ్రహం, ఆవేదనను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ‘హాయ్ సార్ నేను ఢిల్లీ నుంచి వారణాసికి 22416 వందేభారత్‌లో ప్రయాణిస్తున్నా. మాకు ఇచ్చిన ఆహారం పాడై దుర్వాసన వస్తోంది. దయచేసి నా డబ్బు మొత్తాన్ని వాపసు చేయండి. ఫుడ్ విక్రేతలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ పేరును పాడు చేస్తున్నారు’ అని అందులో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్స్‌ను కూడా పోస్ట్ చేశాడు. ఇండియన్ రైల్వే, వందే భారత్ అధికారులు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు దీనిని ట్యాగ్ చేశాడు.
మరోవైపు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అసౌకర్యాలు, నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్న రైల్వేపై నెటిజన్లు మండిపడ్డారు.
https://twitter.com/akash24188/status/1743654735046193341?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1743654735046193341%7Ctwgr%5Ea7c2454b615dae2d389d6f8676eca72570893d1d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Findia%2Fvideo-delhi-varanasi-vande-bharat-passengers-demand-refund-for-being-served-spoilt-stale-food
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

