న్యూఢిల్లీ : ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్ విమానం (Airbus A320neo)ను జైపూర్‌కు మళ్లించినట్లు డీజీసీఏ తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి గురువారం రాత్రి బయలుదేరిన ఇండిగో విమానాన్ని మళ్లించడంతో 8.30 గంటలకు సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందని పేర్కొంది. కొద్ది సెకన్ల పాటు విమానం ఇంజిన్లలో వైబ్రేషన్స్ వచ్చాయని, దీంతో విమానాన్ని జైపూర్‌కు మళ్లించినట్లు శుక్రవారం తెలిపింది.
మరో విమానంలో ప్రయాణికులను వడోదరకు పంపినట్లు పేర్కొంది. దీనిపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. విమానాల్లో లోపాలు వెలుగులోకి రావడంతో విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 19 నుంచి జూలై 6 మధ్య కంపెనీకి చెందిన దాదాపు ఎనిమిది విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.