న్యూఢిల్లీ, జూన్ 10: డిజిటల్ యుగంలో ఆధునిక ప్రేమ సంబంధాలు, డేటింగ్ యాప్‌లు, సమస్యలు.. సంబంధాల ఒత్తిడిని ఎదుర్కొనటంలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సహాయపడటానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం ఒక సరికొత్త కోర్సును ప్రవేశపెట్టింది. ప్రేమ వ్యవహారాలు, డిజిటల్ డేటింగ్, విషపూరితమైన ప్రవర్తనలను అధ్యయనం చేసే విధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ‘నెగోషియేటింగ్ ఇంటిమేట్ రిలేషిన్షిప్స్’ అన్న కోర్సును వర్సిటీ సైకాలజీ విభాగం ఆఫర్ చేస్తున్నది.
నిజ జీవిత ఉదాహరణలు, గ్రూప్ డిబేట్లు, విశ్లేషణలతో ఈ కోర్సు ఉంటుందట. కేవలం ప్రేమ సంబంధాల గురించే కాకుండా, భావోద్వేగ మేధస్సును అభివృద్ధి చేసుకోవటం, లైఫ్ స్కిల్స్‌ను మెరుగుపర్చుకోవటంలో కోర్సు దోహదపడుతుందని వర్సిటీ పేర్కొన్నది.