ఢిల్లీలో పోలీసుల దౌర్జన్యం
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజధాని ఢిల్లీలో ఆదివారం కొనసాగిన నిరసనపై పోలీసులు తీవ్ర దమనకాండకు పాల్పడ్డారు. రాజధాని అంతా ఖాకీమయం అయ్యింది. ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలు దర్శనమిచ్చాయి. నగరమంతా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడటంతో పౌరులు బయటకు రావడానికే భయపడ్డారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 : కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజధాని ఢిల్లీలో ఆదివారం కొనసాగిన నిరసనపై పోలీసులు తీవ్ర దమనకాండకు పాల్పడ్డారు. రాజధాని అంతా ఖాకీమయం అయ్యింది. ఎక్కడ చూసినా భారీ సంఖ్యలో పోలీసులు, భద్రతా బలగాలు దర్శనమిచ్చాయి. నగరమంతా ఒక యుద్ధ వాతావరణం ఏర్పడటంతో పౌరులు బయటకు రావడానికే భయపడ్డారు. ఎక్కడికక్కడ బారికేడ్లతో రోడ్ల దిగ్బంధం కొనసాగింది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఆందోళనకారులు కన్పిస్తే చాలు పోలీసులు వారివైపు ఉరుక్కుంటూ వెళ్లి చెదరగొట్టడమే కాక, అదుపులోకి తీసుకోవడం కన్పించింది. ఆందోళనను కవర్ చేస్తున్న జర్నలిస్టుల పట్ల కూడా వారు అమానుషంగా వ్యవహరించారు.
వారిని కూడా ఆందోళనకారుల్లా భావిస్తూ దురుసుగా ప్రవర్తించారు. పలువురు జర్నలిస్టులు, వీడియో, ఫొటోగ్రాఫర్లను ఆందోళన జరుగుతున్న ప్రాంతాల నుంచి 12 కి.మీ దూరం తీసుకుపోయి వదిలారు. సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్ పట్ల కూడా వారు అదే తీరులో వ్యవహరించారు. ఆయనపై కూడా దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులు ఆయనను వ్యాన్‌లో ఎక్కించుకుని దూరంగా రోడ్డుపక్కన విడిచిపెట్టారు. అప్పటికే ఆయన తీవ్రంగా గాయపడి ఉన్నారు. పలువురు పోలీసులు మఫ్టీలో ముఖ్యమైన ప్రాంతాల్లో మోహరించి ఉన్నతాధికారులకు ఆందోళనకారుల గురించి సమాచారాన్ని అందజేశారు. ఆందోళనకారుల నిర్బంధం పేరుతో పవిత్రమైన గురుద్వారాలోని పలువురు పోలీసులు బూట్లతో లోపలికి ప్రవేశించారని ఆరోపణలు వచ్చాయి.
ఎలాంటి కారణాలు చూపకుండానే జర్నలిస్టుల నిర్బంధం
ముఖ్యంగా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ బండారాన్ని బయటపెట్టిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన హిందీ జర్నలిస్టులపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు. కన్నాట్‌ప్లేస్‌లో ఆందోళనను కవర్ చేస్తున్న శాశ్వత్, సియా, విజయ్‌లు తమ ఐడెంటిటీ కార్డులను పోలీసులకు చూపెట్టినా వారిపట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా బస్‌లో తరలించారు. వారిని 45 నిమిషాల తర్వాత 12 కి.మీ దూరంలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద వదిలిపెట్టారు. కొందరు ఇతర జర్నలిస్టుల పట్ల కూడా వారు ఇదేవిధంగా వ్యవహరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

