ఢిల్లీలో రికార్డుస్థాయిలో 17,282 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ మరింత కలవరపరుస్తున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో 17,282 కరోనా కేసులు 104 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,438కు, మరణాల సంఖ్య 11,540కు పెరిగింది. బుధవారం 9,952 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి సంఖ్య 7,05,162కు, యాక్టివ్ కేసుల సంఖ్య 50,736కు చేరింది.
మరోవైపు ఢిల్లీలోని ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 14 ప్రైవేట్ ఆసుపత్రులను పూర్తిగా కరోనా ఆసుపత్రులుగా ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఇందులోని మొత్తం 3,553 పడకలను పూర్తిగా కరోనా రోగులకే కేటాయించి చికిత్స అందించనున్నారు. అలాగే ఈ ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యాన్ని 35 శాతం పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కాగా, ఢిల్లీలో కరోనా తీవ్రత దృష్ట్యా సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో సమావేశం కానున్నారు. అలాగే ఆరోగ్య మంత్రితోపాటు ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులతో కరోనా పరిస్థితిపై చర్చించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

