Drug Queen | ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన డ్రగ్ క్వీన్.. సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్
Drug Queen | ఢిల్లీ (Delhi) లో మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను నడుపుతూ ‘డ్రగ్ క్వీన్ (Drug Queen)’ గా పేరుపొందిన కుసుమ్ (Kusum) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆమె ఆచూకీ కోసం పోలీసులు రెండు నెలల క్రితం సీక్రెట్ ఆపరేషన్ (Secret Operation) చేపట్టారు.
Drug Queen : ఢిల్లీ (Delhi) లో మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను నడుపుతూ ‘డ్రగ్ క్వీన్ (Drug Queen)’ గా పేరుపొందిన కుసుమ్ (Kusum) అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆమె ఆచూకీ కోసం పోలీసులు రెండు నెలల క్రితం సీక్రెట్ ఆపరేషన్ (Secret Operation) చేపట్టారు. వారాల తరబడి 200 సీసీటీవీ కెమెరాలు, 100 ఫోన్లను ట్రాక్ చేశారు. తాజాగా ఢిల్లీలోని షాదారా ప్రాంతంలోగల ఓ ఇంట్లో కుసుమ్ ఉన్నట్లు గుర్తించారు.
సీక్రెట్‌గా ఆ ఇంట్లోకి వెళ్లి కుసుమ్‌ను అరెస్ట్ చేశారు. నిందితురాలిపై 11 కేసులు, రూ.50 వేల రివార్డు ఉన్నట్లు తెలిపారు. గతంలో కుసుమ్ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో డ్రగ్స్ విక్రయిస్తూ గ్యాంగ్స్టర్లతో కలిసి పనిచేసేది. క్రమంగా సొంత డ్రగ్ సిండికేట్‌ను ఏర్పాటు చేసుకొంది. ఢిల్లీలో హత్యలు, దోపిడీ, మాదకద్రవ్యాల దందాను చురుగ్గా నడిపిస్తోంది. అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించింది. పలు రాష్ట్రాలలోని మాదకద్రవ్యాల ముఠాలు ఆమె నేతృత్వంలోనే నడుస్తున్నాయి.
ఆమె ఇద్దరు కుమార్తెలు, సోదరుడు కూడా ఇదే సిండికేట్‌లో పని చేస్తున్నారు. కుసుమ్ ఎక్కడా తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా జాగ్రత్త పడేది. ఆమెపై అనుమానం ఉన్నప్పటికీ.. అదుపులోకి తీసుకోవడం పోలీసులకు సాధ్యం కాలేదు. 2003 నుంచి పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. వారు దాడులు చేపట్టిన ప్రతిసారీ కుసుమ్ మాయమైపోయేది. ఫోన్‌ను ఉపయోగించకుండా కొత్త ప్రదేశాల్లో తలదాచుకుంటూ ఉండేది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

