Supreme Court: ఢిల్లీలో ఆస్పత్రుల నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి
Supreme Court: ఢిల్లీలో ఆస్పత్రుల నిర్మాణాలు కొనసాగించేందుకు అక్కడి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కడుతున్న ఆస్పత్రుల నిర్మాణాన్ని కొనసాగించవచ్చని

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆస్పత్రుల నిర్మాణాలు కొనసాగించేందుకు అక్కడి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ( Supreme Court ) అనుమతించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కడుతున్న ఆస్పత్రుల నిర్మాణాన్ని కొనసాగించవచ్చని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఢిల్లీతోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా వాయు కాలుష్యం పెరిగిపోయింది. వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, రైతులు తమ పొలాల్లో కొయ్యకాలు కాల్చడం లాంటివి కాలుష్యానికి కారణమని తేల్చారు.
అదేవిధంగా భవన నిర్మాణ ప్రాంతాల నుంచి వెలువడే దుమ్ముధూళి కూడా వాయు కాలుష్యానికిగల కారణాల్లో ఒకటిగా గుర్తించారు. అందుకే ఢిల్లీలో భవన నిర్మాణాలపై తాత్కాలికంగా నిషేధం విధించారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో ఆస్పత్రుల నిర్మాణం కొనసాగించేందుకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

